దేవాదాయశాఖ భూములని ఎవరు అక్రమించినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో తాగుబోతుల తరపున వకాల్తా పుచ్చుకున్న ఏకైక పార్టీ టీడీపీనే అంటూ ఎద్దేవా చేశారు. నిత్యావసరాల రేటు పెరిగితే ఆందోళన చెందాల్సిన ప్రతిపక్షం మందు రేట్లు పెరిగితే మాట్లాడడం కరక్టెనా.? అని ప్రశ్నించిన ఆయన.. మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని సీఎం ముందే చెప్పారన్నారు. తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. సుదీర్ఘకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేయసిన యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *