ఢిల్లీ: ఓ యువతిని బాత్‌రూమ్‌లో బంధించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా చొరబడి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఘటన అనంతరం యువతిని వారిద్దరూ బెదిరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని భయపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. విషయాన్ని బాధితురాలు తన కుటుంబసభ్యులకు చెప్పింది. వెంటనే వారు పోటీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు అందులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో నిందితుని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *