Category: Uncategorized

ఏపీలో 15 మంది ఐపీఎస్‌ ఆఫీసర్ల బదిలీలు, తక్షణమే అమలులోకి..

ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను మంది ఐపీఎస్‌ ఆఫీసర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పేరు మీదుగా ప్రభుత్వ జీవో విడుదల అయ్యింది. ఎల్‌కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్‌డీ రామకృష్ణ, కేవీ…

బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌గా సీహెచ్‌ ప్రతాప్‌రెడ్డి

కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌గా తెలుగు సీనియర్‌ ఐపీఎస్‌ సీహెచ్‌ ప్రతాప్‌రెడ్డి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ప్రతాప్‌రెడ్డి 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.…

మూడు నెలల్లో.. ముగ్గురు సీజేలు!

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల స్వల్ప వ్యవధిలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతోంది. ఇద్దరు సీజేలు రిటైర్‌ కానుండటంతో ఈ అరుదైన సందర్భం రాబోతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 16తో…

రేపటికి ఏపీ అసెంబ్లీ వాయిదా

సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు.

వరకట్నం సమయానికి చెల్లించలేదని

లక్నో: మహిళలపై వేధింపులు, అకృత్యాలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కేటుగాళ్లలో మార్పులు రావడం లేదు. తాజాగా, వరకట్న దాహనికి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన…

ఆయన మంత్రి కాదు.. శాసనసభ సభ్యుల్లో ఆయనొకరు.. వీరాభిమానం చాటుకున్న పోలీసులు!

ఆయన మంత్రి కాదు. అలాగని ప్రభుత్వ పదవిలోనూ లేరు. వందల మంది ఎమ్మెల్యేల్లో ఆయనొకరు. ఎందుకో తెలియదు కానీ.. ఆ నేతపై వీరాభిమానం చాటుకున్నారు పోలీసులు. ఆయన బర్త్‌డే వేడుకల్లో నానా హంగామా చేశారు. గజమాలతో ఘనంగా సత్కరించారు. అంతటితో ఆగకుండా…

షిప్‌యార్డును సందర్శించిన తెలంగాణ గవర్నర్‌

తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)ని సందర్శించారు. ఆమె స్టీల్‌ షాపులు, బిల్డింగ్‌ డాక్‌, హెచ్‌ఎస్‌ఎల్‌లోని రిపేర్‌ డాక్‌లను సందర్శించారు. అనంతరం హెచ్‌ఎస్‌ఎల్‌లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యాలను ఆమె తెలుసుకున్నారు. ఆమెకు…

రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కంచరపాలెం:స్థానిక 53వ వార్డు శివనగర్‌, ఆంధ్ర కేసరి నగర్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త, రాష్ట్ర నెడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కె.కె రాజు బుధవారం పర్యటిం చారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి), సామాజిక భవనం, గ్రామ…

తొలగించిన ఒప్పంద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి

కెజిహెచ్‌లో తొలగించిన 65 మంది ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, డిఓలను (ఒప్పంద ఉద్యోగులు) వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం ఉదయం సీతమ్మధారలోని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటివద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌…

సమతామూర్తి విగ్రహావిష్కరణకు సీఎం జగన్‌ను ఆహ్వానించిన చిన్నజీయర్‌ స్వామి

భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌లోని త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. ఈ గొప్ప వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను చిన్నజీయర్‌ స్వామీజీ ఆహ్వానిస్తున్నారు.