ఆంధ్రప్రదేశ్

 • హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు
  హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు

  హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఏసీబీ కోర్టు ఇప్పటికే వాళ్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ మంజూరు చేయాలని రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు నిందితులు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.

   

క్రైమ్

 • శ్రద్ధా హత్య కేసులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు
  శ్రద్ధా హత్య కేసులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఆఫ్తాబ్ పూనావాలా(Aaftab) తన లైవ్-ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి దారుణంగా చంపిన తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసేందుకు 10 గంటల సమయం పట్టిందని ఢిల్లీ పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది. శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలు చేసే మధ్యలో ఆఫ్తాబ్ బ్రేక్ తీసుకొని బీరు, సిగరెట్ తాగాడని, భోజనం ఆర్డర్ చేశాడని వెల్లడైంది.(Beer,Netflix, and Chill)

  దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్దా దారుణ హత్య వివరాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.అపార్ట్‌మెంట్‌లో తన జీవిత సహచరి అయిన శ్రద్ధాను గొంతు కోసి చంపిన ఆఫ్తాబ్, ఆ తర్వాత సాక్ష్యాలను వదిలించుకోవడానికి మార్గాలను కూల్ గా రూపొందించాడని పోలీసుల(Police) దర్యాప్తులో వెల్లడైంది.శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలు చేయడానికి తనకు 10 గంటల సమయం పట్టిందని అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.తాను అలసిపోయినప్పుడు మధ్యమధ్యలో విరామం తీసుకున్నానని,శరీర భాగాలను కడగడానికి తనకు కొన్ని గంటల సమయం పట్టిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు.

  తన జీవన సహచరి అయిన శ్రద్ధాను గొంతు కోసి చంపి, ముక్కలు చేశాక ఆఫ్తాబ్ జోమాటో నుంచి ఆహారం ఆర్డర్ చేశాడు.శ్రద్ధా హత్యానంతరం బీరు, సిగరెట్ తాగి, శవం ముక్కల ముందే భోజనం చేసి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూశాడని ఢిల్లీ పోలీసుల ఇంటరాగేషన్‌లో వెలుగుచూసింది. మొత్తం మీద శ్రద్ధా హత్య ఉదంతం ఆసాంతం క్రైం థ్రిల్లర్ స్టోరీని తలపిస్తోంది.